భారతదేశంలో సందర్శించాల్సిన 8 టైగర్ రిజర్వ్లు..

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్: పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రసిద్ధ రిజర్వ్. ఇక్కడ పక్షి జాతులు కూడా ఎక్కువగా ఉంటాయి. 

బాంధవ్‌గర్ నేషనల్ పార్క్: ప్రపంచంలోనే అత్యధిక పులుల సాంద్రత కలిగిన ప్రదేశం. ఇక్కడి పురాతన కోటలు ప్రత్యేక ఆకర్షణ.

రణతంబోర్ నేషనల్ పార్క్: పులులను గుర్తించడానికి అనువైన ప్రదేశం. ఇక్కడ రణతంబోర్ కోట వంటి చారిత్రక శిథిలాలు ఉన్నాయి.

సుందర్బన్స్ టైగర్ రిజర్వ్: మడ అడవులకు ప్రసిద్ధి. ఇక్కడ బెంగాల్ పులులు, చిరుతపులులు, ఏనుగులు వంటివి కనిపిస్తాయి.

కన్హా నేషనల్ పార్క్: సుందరమైన దృశ్యాలకు పులులతో సహా వివిధ రకాల వన్యప్రాణులకు నిలయం.

తడోబా అంధారి టైగర్ రిజర్వ్: ఇక్కడి టైగర్ సఫారీలు ప్రసిద్ధి. స్లాత్ బేర్, వైల్డ్ డాగ్స్ వంటివి కూడా కనిపించే అవకాశం ఉంది.

నాగర్హోల్ నేషనల్ పార్క్: అత్యధిక పులుల సంఖ్య కలిగిన పార్కులలో ఇది ఒకటి.

పెరియార్ టైగర్ రిజర్వ్: పశ్చిమ కనుమలలోని దట్టమైన అడవులకు పేరుగాంచింది. ఇక్కడ పులులు, ఏనుగులు, వివిధ రకాల పక్షి జాతులు ఉంటాయి.