మనాలి.. హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి. ఈ ప్రాంతంలో పర్వతాలను నిత్యం మంచు దుప్పటి కప్పి ఉంటాయి.

ఔలి.. ఉత్తరాఖండ్‌లోని ఔలి. దీనిని భారతదేశం స్కీయింగ్ రాజధానిగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో అత్యంత ఎత్తైన శిఖరాలు.. నందా దేవి, త్రిశూల్ ఉన్నాయి.

గుల్మార్గ్.. జమ్మూ కశ్మీర్‌లోని గుల్మార్గ్. శీతాకాలంలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు ఉన్న అత్యంత అందమైన ప్రాంతాల్లో ఇది ఒక్కటి.

లేహ్.. జమ్మూ కశ్మీర్‌లోని లడాఖ్‌లో లేహ్ నగరం. ట్రెక్కింగ్, బైకింగ్, స్నో క్యాంపింగ్ కోసం పర్యాటకులు ఈ నగరానికి పోటెత్తుతారు.

తవాంగ్.. శీతాకాలంలో సాహసయాత్ర చేయాలంటే మాత్రం.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ పట్టణం వెళ్లాల్సిందే. 

మున్నార్.. శీతాకాలంలో మున్నార్ పచ్చని తోటలు, జలపాతాలు, సుందరమైన దృశ్యాలతో కూడిన ఒక అద్భుతమైన ప్రదేశం.