ప్రస్తుతం మార్కెట్లలో దొరికే వస్తువుల్లో ఏది అసలైనదో ఏది నకిలీనో తెలుసుకోవడం చాలా కష్టంటా మారింది.
తేనె ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు తేనె దివ్వౌషధంలా ఉపయోగపడుతుంది.
ఒక గ్లాసులో కొన్ని మంచి నీళ్లను తీసుకోవాలి. అనంతరం అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి.
అనంతరం అందులో కాస్త వెనిగర్ వేయాలి. ఒకవేళ నురుగు వస్తే వస్తే ఆ తేనె కల్తీ అని అర్థం.
ఒక అగ్గి పుల్లను తీసుకొని దానిని తేనెలో ముంచాలి. అనంతరం ఆ పుల్లను అగ్గిపెట్టెతో ముట్చించాలి. ఒకవేళ అగ్గి పుల్ల వెలిగితే ఆ తేనే స్వచ్ఛమైందని అర్థం.
చేతి బొటనవేలిపై కొంచెం తేనె వేయాలి. ఒకవేళ ఆ తేనె జారకుండా అలాగే అతక్కుపోతే అది నాణ్యమైన తేనె అని అర్థం. అలాకాకుండా వేలి నిండా వ్యాపించి జారిపోతే కల్తీదని అర్థం.
ఒక చెంచా తేనెను తీసుకొని గ్లాసులో వేయాలి. అంనతరం గ్లాసును అటు ఇటు తిప్పాలి.
ఒకవేళ స్వచ్ఛమైన తేనె అయితే నీటిలో కరగదు. ఒకవేళ తేనె నీటిలో కరిగిందో అది కల్తీ అని అర్థం.