చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ కాలంలో తగినంత నీరు తాగితే చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది. 

స్నానం చేసిన మూడు నిమిషాల లోపు మాయిశ్చరైజర్ వాడితే తేమ నిలిచి ఉంటుంది. 

ఎక్కువ సేపు వేడి నీటితో స్నానం చేయకూడదు 

చర్మంపై మృతకణాలను తొలగించేందుకు వారానికి ఒకటి రెండు సార్లు ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి

ఇంట్లోని వాతావరణంలో తేమ నిలిచి ఉండేందుకు హ్యూమిడిఫయ్యర్ వాడాలి

చలి గాలుల నుంచి రక్షణ కోసం స్వెటర్ గ్లోవ్స్ వంటివి తప్పనిసరిగా వాడాలి. 

ఈ కాలంలో చర్మ ఆరోగ్యం కోసం ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఫుడ్స్ తినాలి.