ఆయిలీ చర్మం ఉన్న వాళ్లు జుట్టుకు అతిగా నూనె పెట్టుకోకూడదు. దీని వల్ల చర్మం రంధ్రాలు పడుకుపోతాయి.

కొందరు రాత్రిళ్లు నెత్తికి నూనె రాసుకుని తెల్లారాక తల స్నానం చేస్తుంటారు. ఇది కూడా పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు.

రాత్రంతా ఇలా నెత్తిపై నిలిచి ఉండే నూనె కారణంగా చర్మ రంధ్రాలు పూడుకుపోతాయి.

కాబట్టి, తలస్నానాని కొద్దిగంటల ముందు నూనె పెట్టుకుంటే ఇబ్బందులు చాలా వరకూ తొలగిపోతాయనేది నిపుణులు చెప్పేమాట.

 ఇక డాండ్రఫ్‌తో బాధపడే వారు కూడా నెత్తికి నూనె రాసుకోకుండా ఉంటేనే మంచిది. 

నెత్తిపై పొట్టు రేగే సమస్య నూనె రాసుకుంటే మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాబట్టి.. నెత్తికి నూనె రాసుకునే సమయంలో ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.