జుట్టు ఒత్తుగా పెరగాలంటే కొన్ని సప్లిమెంట్స్‌ను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

బయోటిన్‌తో కెరాటిన్ ఉత్పత్తి పెరిగి జుట్టు ఒత్తుగా మారుతుంది. 

ఫోలిక్ యాసిడ్, బీ విటమిన్స్‌తో జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. 

న్యూట్రాసిటికల్స్‌తో కూడా జుట్టు బలోపేతం అవుతుంది. 

విటమిన్ డీ లోపిస్తే జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది కాబట్టి ఈ విటమిన్‌ను కూడా తీసుకోవాలి

ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్‌తో ఇన్‌ఫ్లమేషన్ తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 

గుమ్మడికాయ గింజల నూనె డీహెచ్‌టీ హార్మోన్‌ను అడ్డుకుని జుట్టూ ఊడటాన్ని తగ్గిస్తుంది 

ఈ సప్లిమెంట్స్‌ను అతిగా వాడితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్న విషయం మరువద్దని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.