దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు ఈ టిప్స్ తప్పనిసరిగా పాటించాలి

తగినంత నీరు తాగితే కిడ్నీల్లోని విషతుల్యాలు పూర్తిగా తొలగిపోతాయి

బీపీని నియంత్రణలో పెట్టుకుంటే కిడ్నీలపై చెడు ప్రభావం చాలా వరకూ తగ్గిపోతుంది. 

రక్తంలో అధిక చక్కెర వల్ల కిడ్నీల్లో రక్తనాళాలు దెబ్బతింటాయి కాబట్టి షుగర్‌పై కంట్రోల్ తప్పనిసరి

అధిక బరువు వల్ల బీపీ, షుగర్ వ్యాధులు వస్తాయి. కాబట్టి బరువును అదుపులో పెట్టుకోవాలి

ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే కిడ్నీపై ఒత్తిడి తగ్గుతుంది. 

పెయిన్ కిల్లర్స్‌తో కిడ్నీలపై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త

ధూమపానంతో కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గుతుంది. కాబట్టి ఈ అలవాటును మానేయాలి.