కొన్ని చామంతి పువ్వులను పసుపు, తెలుపు ఏ ఇతర రంగువి అయినా నీటిలో కానీ పాలతో ఉడకబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి.

ఈ పేస్ట్‌కు కొన్ని చుక్కల తేనె, నిమ్మరసం లేదా కస్తూరి పసుపు కలిపి, చర్మానికి ప్యాక్‌లా వేసుకోవాలి.

ఈ ప్యాక్‌ను దాదాపు 15-20 నిమిషాలు ఆరాక, చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

చామంతి పువ్వులను నీటిలో మరిగించి, చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవచ్చు.

ఈ నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని మలినాలు తొలగిపోయి, చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

చామంతి పువ్వులలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి, ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఇవి చర్మంలో వాపును తగ్గించి, చర్మ సమస్యలను నివారిస్తాయి.

చామంతి పువ్వుల నీటిని లేదా పేస్ట్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది.