టూత్ పేస్ట్‌ కేవలం పళ్లను శుభ్రం చేయటం కోసం మాత్రమే కాదు. ఈ వస్తువుల్ని శుభ్రం చేయడానికి కూడా వాడొచ్చు.

పళ్లను శుభ్రం చేసినట్లే వీటిని కూడా టూత్ పేస్ట్ శుభ్రం చేసేస్తుంది.

నల్లగా మారిపోయిన వైట్ షూలను శుభ్రం చేయడానికి టూత్ పేస్ట్ అద్భుతంగా పని చేస్తుంది.

షూలపై కొద్దిగా టూత్ పేస్ట్ రాసి బ్రష్‌తో రుద్దితే సరిపోతుంది. తలతలా మెరిసిపోతాయి.

మొబైల్ ఫోన్‌ స్క్రీన్‌ను క్లీన్ చేయటం కోసం కూడా టూత్ పేస్ట్ వాడొచ్చు.

సిల్వర్‌తో తయారు చేసిన వస్తువుల్ని శుభ్రం చేయటం కోసం కూడా టూత్ పేస్ట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

దుస్తులపై అయిన మరకల్ని తొలగించడానికి కూడా టూత్ పేస్ట్ వాడొచ్చు.

పసుపు, ఆయిల్ మరకల్ని పోగొట్టడంలో టూత్ పేస్ట్ చక్కగా పని చేస్తుంది.