పిల్లలు పుట్టకపోవడానికి  ఈ అంశాలే అసలు కారణాలు..!

సంతానం అనేది దంపతులకు ఓ వరం వంటిది. వివాహమైన తర్వాత ప్రతి మహిళా తల్లి కావాలని తపిస్తూ ఉంటుంది.

అయితే వివిధ కారణాల వల్ల కొందరికి సంతానం అందడంలో ఆలస్యం అవుతుంటుంది. మరికొందరికి జీవితాంతం అది తీరని కోరికగానే ఉండిపోతుంటుంది.

జీవనశైలిలో మార్పుల కారణంగానే ఎక్కువ శాతం మహిళలు సంతాన లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

జంక్ ఫుడ్, ఊబకాయం, వయసు సంబంధిత సమస్యల కారణంగా గర్భదారణ విషయంలో సమస్య తలెత్తుతోందని అంటున్నారు.

సంతానలేమి సమస్య తలెత్తడానికి ధూమపానం  మరో ప్రధాన సమస్య. పొగాకులో కాడ్మియం, కోటినిన్ వంటి విషపూరిత మూలకాలు ఉండడం వల్ల.. ధూమపానం చేసే స్త్రీలలో అండం ఉత్పత్తి తగ్గుతుంది.

అదేవిధంగా మద్యపానం చేసే స్త్రీల శరీరంలో.. గర్భధారణకు అవసరమైన విటమిన్ బి, జింక్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు తుక్కువగా ఉంటాయి

కొందరు గర్భం వాయిదా వేసేందుకు వివిధ రకాల మందులు తీసుకుంటూ ఉంటారు. మరికొందరు గర్భం దాల్చకుండా ఉండేందుకు ఇంజెక్షన్లు కూడా తీసుకుటుంటారు. ఇలాంటి వారిలో కూడా సంతానం కలగడం కష్టంగా మారుతుంటుంది.