బాత్‌రూంలల్లో ఎన్ని సూక్ష్మ క్రిములు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే, బెడ్‌రూమ్‌లో మనం నిత్యం వాడే దిండ్లపై కూడా ఇంతకంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.
బెడ్ షీట్స్, దుప్పట్లు, దిండ్ల కవర్లు క్రమం తప్పకుండా ఉతకకపోతే బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో పేరుకుంటుంది.
నాలుగు వారాల పాటు వీటిని ఉతక్కుండా ఉంటే దిండ్ల కవర్లు, దుప్పట్లపై టాయిలెట్‌లో కంటే 17 వేల ఎక్కువ బ్యాక్టీరియా చేరుతుంది.
అంటే ఒక చదరపు అంగుళంలో 3 నుంచి 5 మిలియన్ల బ్యాక్టీరియా వరకూ వచ్చి చేరుతాయి అని సంస్థ తన నివేదికలో పేర్కొంది.
అపరిశుభ్ర దిండ్ల కవర్లు, దుప్పట్లతో ఆస్థమా వంటి సమస్యలు కూడా తీవ్రమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
స్ట్రెప్టోకొక్కస్ లాంటి బ్యాక్టీరియాతో ఇన్‌ఫెక్షన్లు కూడా వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే, దుప్పట్లు, దిండ్ల కవర్లను క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
బాదుషా రెసిపీ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా స్వీట్ షాపు స్టైల్ లో..
జుట్టుకు రోజూ నూనె రాసుకుంటారా.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఇలా చేస్తే.. మీ ఆకలి తగ్గుతుంది..
శంఖం పూలతో టీ.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?