పాదాలపై స్వేదం, బ్యాక్టీరియా కారణంగా దుర్వాసన వస్తుంది

బూట్లు, సాక్సుల కారణంగా పాదాలపై తేమ పెరిగి దుర్వాసన  ఎక్కువవుతుంది

ఈ సమస్యకు పరిష్కారం కోసం కాళ్లను యాంటీబాక్టీరియల్ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి

బ్రీతబుల్ సాక్సులు వాడితే పాదాలపై గాలి పారి స్వేదం సమస్య కొంత పరిష్కారం అవుతుంది

బూట్లలోపలికి గాలి పారేలా ఆరబెడితే చాలా వరకూ ఈ సమస్య తగ్గుతుంది

పాదాలపై టాల్క్ పౌడర్, యాంటీఫంగల్ పౌడర్ చల్లితే బ్యాక్టీరియా తొలగిపోయి దుర్వాసన రాదు

వెనిగర్, ఉప్పు కలిపిన నీటిలో పాదాలను నానబెట్టి శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది

గోళ్లను క్రమం తప్పకుండా తొలగించుకుంటే కూడా దుర్వాసన తగ్గుతుంది

వీలైనప్పుడల్లా ఉత్త కాళ్లతో నడుస్తూ ఉంటే స్వేదం ఆరిపోయి దుర్వాసన రాదు