ఈ పళ్లు.. మీ గట్ హెల్త్‌కు  ఎంతో మేలు చేస్తాయి..!

శరీరానికి రెండో మైండ్‌గా పిలిచే గట్ హెల్త్ కోసం క్రమం తప్పకుండా కొన్ని పళ్లను తినాలి. అవేంటో ఒకసారి చూద్దాం.. 

అరటి పళ్లు గట్‌లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. 

పపైన్ అనే ఎంజైమ్‌లను కలిగిన బొప్పాయి గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. 

ఆపిల్స్‌లో ఉండే పెక్టిన్ ఫైబర్ గట్ బ్యాక్టీరియాకు మద్దతుగా నిలుస్తుంది. 

ఆహారాన్ని శోషణం చేసుకోవడంలో సహాయ పడే పైనాపిల్ గట్ హెల్త్‌కు తోడ్పాటునందిస్తుంది. 

కివీ ఫ్రూట్‌లో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ గట్ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. 

యాంటీ-ఆక్సిడెంట్లు, ఫైబర్‌తో నిండిన బెర్రీలు గట్ బ్యాక్టీరియాను కాపాడతాయి. 

పాలీ ఫినాల్స్‌ను పుష్కలంగా కలిగి ఉండే దానిమ్మ గింజలు గట్ మైక్రోబయామ్‌కు మద్దతుగా నిలుస్తాయి. 

నారింజ పళ్లు గట్ లైనింగ్‌ను హైడ్రేటెడ్‌గా ఉంచి ఆరోగ్యకర బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.