ఫోన్ ఛార్జింగ్ 100% పెడితే  ఏమవుతుందో తెలుసా?

 ఈ రోజుల్లో రకరకాల స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నారు. అయితే ఫోన్‌ను ఉపయోగించడానికి ప్రత్యేక పద్ధతులు కూడా ఉన్నాయి...

చాలామంది తమ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేసేటప్పుడు తరచుగా కొన్ని తప్పులు చేస్తుంటారు. అందులో ఫోన్లను 100 శాతం ఛార్జ్ చేయడం!

మీరు పదే పదే 100 శాతం ఛార్జ్ చేస్తే బ్యాటరీ లోపల వేడి పెరుగుతుంది. ఇది బ్యాటరీ సామర్థ్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది.

ఫోన్‌ 100% ఛార్జ్ పూర్తి అయినా తర్వాత అలానే ప్లగిన్ చేయడం ప్రమాదకరం. దీని వల్ల బ్యాటరీ ఉబ్బిపోతుంది. కొన్నిసార్లు పేలిపోవచ్చు కూడా  

చాలా కంపెనీలు మీ ఫోన్‌ను 80 శాతానికి ఛార్జ్ చేయాలని సిఫార్సు చేస్తున్నాయి. ఆపిల్, శాంసంగ్ వంటి బ్రాండ్లు బ్యాటరీని బాగా ఉంచడానికి వివిధ సిఫార్సులను అందిస్తున్నాయి.

ఫోన్ మంచి బ్యాటరీ లైఫ్ కోసం 20% నుంచి 80% మధ్య ఛార్జ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

సరైన ఛార్జింగ్ పద్ధతి: రాత్రంతా మీ ఫోన్‌ను ఎప్పుడూ ఛార్జ్‌లో ఉంచకండి.ఎల్లప్పుడూ ఒరిజినల్ ఛార్జర్‌నే ఉపయోగించండి.వేడి ప్రదేశాలలో ఛార్జ్ చేయవద్దు.ఫోన్ వేడెక్కినప్పుడు ఛార్జర్ నుండి తీసివేయండి.పదే పదే ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం ఆపండి.