ప్రతి విద్యార్థి జీవితంలో బోర్డు పరీక్షలు కీలకమైన ఘట్టం.

ఈ నేపథ్యంలో విద్యార్థులు ర్యాంకులు, మార్కులు అనే ఒత్తిడిలో పడిపోతుంటారు.

ఎంత బాగా చదివినా ఎగ్జామ్స్‌ టైం వచ్చేసరికి తీవ్రమైన ఆందోళన, మానసిక సమస్యలకు గురవుతారు.

ఈ క్రమంలో పరీక్షల కాలంలో విద్యార్థులు ఒత్తడి నుంచి ఎలా బయటపడాలి వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం..

పరీక్షల ఒత్తిడి తగ్గాలంటే పిల్లలు చదివేటప్పుడు విరామం తీసుకోవాలి.

రోజూ కనీసం 20 నిమిషాల రెగ్యులర్ మెడిటేషన్ చేయడం వల్ల ఏకాగ్రత పెంపొందించుకోవడం  సులువు అవుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

వాల్ నట్లు, పండ్లు, ఒమేగా సమృద్దిగా ఉండే ఆహారాలు, కూరగాయలు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి.

మానసిక ఆరోగ్యం బాగుండాలన్నా, ఒత్తిడి తగ్గాలన్నా సరైన నిద్ర చాలా అవసరం.