వంట చేసేటపుడు  ఇలాంటి తప్పులు చేయకండి..

కూరగాయలను మరీ ఎక్కువ సేపు ఉడికించడం వల్ల విటమిన్-సి, ఫోలిక్ యాసిడ్ ఆవిరైపోతాయి. 

ఏదైనా వంటకాన్ని రెండో సారి వేడి చేయడం వల్ల హానికారకంగా మారుతాయి. 

వంటకాల్లో నూనె లేదా నెయ్యిని ఎక్కువగా వినియోగించడం వల్ల చెడు కొలస్ట్రాల్ పెరిగిపోతుంది. 

ఎప్పుడూ ఒకే తరహా వంట నూనెను వినియోగించకూడదు. సన్‌ఫ్లవర్, రైస్ బ్రౌన్ ఆయిల్.. ఇలా నూనెలను మార్చుతూ ఉండాలి.

ఒకసారి వాడేసిన నూనెను మళ్లీ తిరిగి ఉపయోగించకూడదు. 

అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని పారెయ్యకూడదు. గంజి వార్చకుండా అన్నం వండాలి. 

బంగాళాదుంపలు, క్యారెట్ లేదా ఇతర కూరగాయల తొక్కలను ఎక్కువగా పీల్ చేయకూడదు. 

అల్యూమినియం పాత్రల్లో వంట చేయడం వల్ల హానికర లోహం శరీరంలోకి చేరుతుంది. 

తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలను ప్రెజర్ కుక్కర్లో వేసి వంట చేస్తే వాటిల్లోని పోషకాలన్నీ పోతాయి.