కొన్ని ఫుడ్స్ బీపీ పెరిగేందుకు కారణం అవుతాయి. అవేంటో తెలుసుకుందాం.

ఐస్‌క్రీమ్స్‌‌లో కొవ్వులు, చక్కెరల కారణంగా ఒంట్లో నైట్రిక్ ఆక్సైడ్‌ తగ్గి బీపీ పెరిగే అవకాశం ఉంది. 

వెనిగర్, ఉప్పు వేసి నానబెట్టిన ఆలివ్స్‌ కారణంగా బీపీ పెరిగే ఛాన్సుంది. 

ఆలూ చిప్స్‌లోని ఉప్పు కారణంగా కూడా బీపీ పెరుగుతుంది. 

పచ్చళ్లల్లోని నూనె, ఉప్పు కూడా బీపీని పెంచి అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. 

మార్కెట్‌లో లభించే సూప్స్‌లోని ప్రిజర్వేటివ్స్ కారణంగా బీపీ ముప్పు పెరుగుతుంది. 

వెన్నలోని అదిక శాచ్యురేటెడ్ కొవ్వుల కారణంగా కూడా బీపీ లెవెల్స్ పెరుగుతాయి. 

కొబ్బరి నూనెలోని సంతృప్త కొవ్వులు కూడా బీపీ ముప్పును తెస్తాయి. 

చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్‌తో బరువు పెరుగుతారు. ఇది అధిక బీపీకి దారితీస్తుంది.