ఈ రోజువారీ అలవాట్లతో సూపర్ మెమొరీ..

మెదడు సక్రమంగా పని చేయాలంటే నిద్ర చాలా ముఖ్యం. గాఢ నిద్రలోనే మెదడు జ్ఞాపకాలను స్టోర్ చేస్తుంది.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.

కొవ్వు చేపలు, బ్లూబెర్రీస్, ఆకుకూరలు, గింజలు, తృణధాన్యాలు వంటి ఆహారాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవడం కూడా ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది

సంగీతం వినడం లేదా ప్రకృతిలో సమయం గడపడం వంటి ఒత్తిడి తగ్గించే అలవాట్ల వల్ల మీరు మానసిక ప్రశాంతత పొందుతారు.

దీర్ఘ శ్వాస, ధ్యానం వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు మీ మనస్సును సజీవంగా ఉంచుతాయి. ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి

నలుగురితో కలివిడిగా ఉండటం వల్ల ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. మెదడు రిలాక్స్ అయ్యి చకచకా పనులు పూర్తిచేసుకోగలుగుతారు. జ్ఞాపకశక్తి క్షీణించడం అనే సమస్యే రాదు .