ఈ ఆహారపు అలవాట్లే జుట్టు రాలే  సమస్యను అమాంతం పెంచుతున్నాయ్.

 ఈ  ఆహారపు అలవాట్లు జుట్టు రాలే సమస్యను పెంచుతాయ్!

 విటమిన్-ఎ శరీరంలోకి అతిగా వెళితే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.

వేయించిన, ఆయిల్ ఫుడ్స్ లో ఉండే కొవ్వులకు.. డైహైడ్రోటెస్టోస్టెరాన్, టెస్టోస్టెరాన్ స్థాయిలకు మధ్య లింక్ ఉంటుంది.

 ఇది బట్టతలకు కారణమయ్యే హార్మోన్. అలాగే అధిక ఉష్ణోగ్రత వద్ద వండిన ఆహారం శరీరంలో ఆక్సికరణ ఒత్తిడి పెంచుతుంది. ఇవన్నీ జుట్టు రాలే సమస్యను పెంచుతాయి.

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఆహారాలు శరీరంలో చక్కెరలుగా విరిగిపోతాయి. ఇది శరీరంలో ఇన్సులిన్, ఆండ్రోజన్ స్థాయిలు పెంచుతుంది. జుట్టు రాలే సమస్యను పెంచుతుంది.

ప్రాసెస్ చేసిన చక్కెర ఆహారాలు కూడా శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరగడానికి కారణం అవుతుంది. జుట్టు కుదుళ్లను బలహీన పరిచి రాలిపోవడానికి దారితీస్తుంది.

జింక్, ఐరన్ జుట్టు ఆరోగ్యానికి, కెరాటిన్ పెరుగుదలకు అవసరం. ఇది లోపిస్తే కెరాటిన్ పెరుగుదల తగ్గి జుట్టు తెల్లబడటం, రాలిపోవడం జరుగుతుంది.

కాల్షియం లోపం కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుంది.