ముఖ్యంగా ముఖం పై ముడతలు పడటం చాలా మందిని కలవరపెడుతుంది.
ఖరీదైన క్రీములు, లోషన్లు అవసరం లేదు ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో చిట్కాలు పాటించడం ఆరోగ్యానికి మంచిది.
రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి తాజా కలబంద గుజ్జును రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే ముఖం మెరుస్తుంది.
నిమ్మకాయ, తెనే రెండింటిని సమాన మోతాదులో కలిపి వారానికి 2 నుంచి 3 సార్లు ముఖానికి ప్యాక్ లా వేయాలి
ముడతలను తగ్గించడంతో పాటు చర్మానికి సహజ మెరుపును ఇస్తుంది.
రోజూ రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి దానికి ఒక స్పూన్ పాలు కలిపి ముఖానికి పట్టించాలి.20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ మిశ్రమం చర్మానికి పోషణనిచ్చి ముడతలు రాకుండా అడ్డుకుంటుంది