మధుమేహ వ్యాధికి గురయ్యే ముందు మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రాత్రి 8 గంటల సేపు పడుకున్నా కూడా ఉదయం లేవగానే నీరసం, అలసటగా ఉండడం. 

నిద్రలేమి సమస్యతో పాటూ కంటి చూపు తగ్గడం కూడా మధుమేహ వ్యాధికి సంకేతం కావొచ్చు. 

అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా మధుమేహ వ్యాధికి ముందుస్తు హెచ్చరిక. 

చర్మం పొడిబారుతున్న కూడా ఒకసారి వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. 

జుట్టు రాలే సమస్య కూడా కొన్నిసార్లు ఈ వ్యాధికి సంకేతం కావొచ్చు. 

అతిగా ఆకలి, దాహం వేయడం కూడా మధుమేహ వ్యాధి లక్షణాల్లో ఒకటి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.