గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? 

గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని, దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని నమ్ముతారు.

గుడ్లు ఆరోగ్యానికి చాలామంచిది. అయితే.. చాలా మంది గుడ్లను కొవ్వు పదార్థంగా భావిస్తారు. 

 న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 

1968లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గుడ్ల వినియోగాన్ని తగ్గించాలని సిఫారసు చేసింది..

 పరిశోధనలు గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్‌కు శరీరంలోని కొలెస్ట్రాల్‌తో ప్రత్యక్ష సంబంధం లేదని నిరూపించాయి.

 అయితే.. గుడ్లు ఎక్కువగా తినకూడదని.. పరిమితంగా తినాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

కొలెస్ట్రాల్ రోగులు ఉడికించిన గుడ్లలోని తెల్ల భాగాన్ని సులభంగా తినవచ్చు. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగదు

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.