ప్రపంచంలో.. అనేక రంగులు
కలగలిసిన జీవులు ఇవే..
ప్రపంచంలో కొన్ని జీవులు అనేక రంగుల్లో అందరినీ అలరిస్తుంటాయి. వీటిలో ప్రధానంగా కొన్ని జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణ అమెరికాలో కనిపించే పాయిజన్ డార్ట్ అనే కప్పలు ఎరుపు, నీలం, పసుపు రంగులో అందంగా ఉన్నా ముట్టుకుంటే ప్రమాదం.
పసిఫిక్ మహా సముద్రంలో కనిపించే మాండరిన్ చేప ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంటుంది. నీలం, నారింజలతో నీటిలో ఎంతో అందంగా కనిపిస్తుంటుంది.
దక్షిణ అమెరికాలో కనిపించే స్కార్లెట్ మాకా అనే చిలుక ఎరుపు, పసుపు, నీలం రంగులో చూపరులను ఆకట్టుకుంటుంది.
దక్షిణ మెక్సికో అడవుల్లో కనిపించే కీల్-బిల్డ్ టౌకాన్ అనే పక్షులు నలుపు, పసుపు రంగుల్లో అలరిస్తుంటాయి.
ఇండో- పసిఫిక్‌లో కనిపించే ప్యారెట్ షిష్ అని పిలువబడే చేపలు కూడా బ్లూస్, పర్పుల్ రంగులో ఎంతో ప్రకాశవంతంగా ఉంటాయి.
ఆర్కిడ్ మాంటిస్ అనే కీటకాలు గులాబీ, తెలుపు రంగులో పువ్వుల్లో కలిపోయి.. ఆకస్మికంగా దాడి చేస్తుంటాయి.
దక్షిణ అమెరికా, మెక్సికోలో కనిపించే బ్లూ మెర్ఫో అనే సీతాకోకచిలుకలు నీలి రంగులో సూర్య కాంతిలో మెరుస్తూ ఆకట్టుకుంటాయి.
Related Web Stories
ఎక్కువ టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముతున్నారా..
చెప్పుల్లేకుండా నడిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా.. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..?
పండ్లను వెరైటీగా కోసేద్దామిలా...