చెప్పుల్లేకుండా నడిస్తే .. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..

రోజూ ఉదయాన్నే 15 నుంచి 20 నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.  

చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమి నుంచి ఎలక్ట్రాన్లు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయట. ఇవి యాంటీ-ఆక్సిడెంట్లుగా పని చేస్తాయట. 

చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చెప్పులు లేకుండా నడవడం మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. స్ట్రెస్ హార్మోన్ల విడుదలను నివారిస్తుంది. 

చెప్పులు లేకుండా నడవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని అనేక అధ్యయనాలు తేల్చాయి. 

మీరు చెప్పులు లేకుండా నడిస్తే మీ పాదాలపై ఒత్తిడి పడి మీ ఆప్టిక్ నరాలు ఉత్తేజితం అవుతాయి. మీ దృష్టి మెరుగుపడుతుంది.

నిద్రలేమితో బాధపడేవారికి చెప్పులు లేకుండా నడవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు మంచి నిద్రను అందిస్తుంది.

గడ్డిలో చెప్పులు లేకుండా నడవడం మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి దోహదపడుతుంది. 

చెప్పులు లేకుండా నేలపై నడవడం గుండె, మానసిక ఆరోగ్యం, కండరాలకు మేలు చేస్తుంది.