పెసరపప్పు ఇడ్లీ ఇలా చేస్తే
రుచితో పాటు ఆరోగ్యం..!
ముందుగా పెసరపప్పుని రెండు గంటల పాటు నానబెట్టాలి.
ఆ తరవాత నీటిని వడగట్టి పెసరపప్పుని, మిక్సీలో పెరుగుతో పాటు రుబ్బాలి.
ఈ మిశ్రమాన్ని ఓ వెడల్పాటి గిన్నెలోకి వేసుకోవాలి.
ఓ పాన్‌లో కాస్త నూనె వేసి ఆవాలు, మినప పప్పు, శనగ పప్పు, జీలకర్ర, కరివేపాకును చిటపటలాడించాలి.
అల్లం, మిర్చి ముక్కలూ జతచేయాలి. క్యారెట్ తురుము, పసుపు కలపాలి.
మంచి సువాసన వస్తుంటే రవ్వను వేసి వేయించి పక్కన పెట్టాలి.
అంతా చల్లారాక ఈ మిశ్రమాన్ని పెసరపప్పు రుబ్బులో కలపాలి.
కొత్తిమీర, ఉప్పు వేసి మూతపెట్టి ఇరవై నిమిషాలు తరవాత ఇడ్లీలు పెట్టుకుంటే సరి.
Related Web Stories
చాలా బక్కగా ఉన్నారా.. బరువు పెరగాలంటే ఈ ఫుడ్స్ బెస్ట్!
మీకు షుగర్ ఉందా? ఈ ఆయుర్వేద సూత్రాలను పాటించండి..!
డ్రెస్సులు ఇలా ప్యాక్ చేస్తే ఎప్పటికీ కొత్తగా ఉంటాయి..
మళ్లీ వేడి చేస్తే విషపూరితం అయ్యే ఆహారాలు ఇవే..