మళ్లీ వేడి చేస్తే విషపూరితం అయ్యే ఆహారాలు ఇవే..

మీరు సీఫుడ్స్‌ను తరచుగా వేడి చేసి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు

వేయించిన ఆహార పదార్ధాలను మళ్లీ వేడి చేసి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి

ఆకుకూరలను మళ్లీ వేడి చేసి తినకూడదు. ఎందుకంటే వీటిని మళ్లీ వేడి చేస్తే వాటిలోని ఖనిజాలు కోల్పోతాయి. ఎలాంటి పోషక ప్రయోజనాలు ఉండవు.

ఉడికించిన గుడ్లను మళ్లీ వేడి చేయడం ప్రమాదకరం. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. 

వేడిచేసిన బంగాళాదుంపలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి మళ్లీ వేడి చేయడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది

కాఫీ లాగే, టీ ,ని మళ్లీ వేడి చేస్తే దాని ప్రయోజనాలను కోల్పోతుంది. అంతేకాదు, ఇది టీలో టానిన్ సాంద్రతను కూడా పెంచుతుంది.

చాలా మంది అన్నంను మళ్లీ వేడి చేసి తింటారు. అయితే, ఇలా వేడి చేస్తే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుంది. 

 ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.