నోరూరించే గోంగూర పచ్చడి
ఇలా చేసి పెడితే తిన్నవాళ్లందరూ
ఫిదా అవ్వాల్సిందే..!
కావాల్సిన పదార్థాలు మిరపకాయలు, గోంగూర ఆకులు, మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆయిల్, చింతపండు, ఉప్పు, పసుపు,వెల్లుల్లి రెబ్బలు
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మెంతులు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి.
స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత చింతపండు, గోంగూర ఆకులు వేసి కలుపుతూ తేమ లేకుండా మగ్గించుకోవాలి.
నూనెలో గోంగూర బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి.
మిక్సీజార్‌లోకి కట్ చేసిన పండుమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత వేయించిన మెంతులు జీలకర్ర పొడి, పూర్తిగా చల్లారిన గోంగూర వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని గాజు జార్లో పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది.
అద్భుతంగా ఉండే గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ
వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ పచ్చడిని తింటే అమృతమే. మీరూ ఓ సారి ట్రై చేయండి.
Related Web Stories
గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?
టూత్ పేస్ట్‌తో మొటిమలు తగ్గుతాయా..!
వేపాకులు వర్సెస్ కరివేపాకు జుట్టుకు ఏది మంచిదంటే
ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఇలా చేయండి