పొద్దు తిరుగుడు పూలు ఇంట్లో పెడితే ముచ్చటగా ఉంటుంది.
పూలు ఉంచిన చోటును కాంతివంతం చేస్తోంది. గదిలో మంచి వాతావరణం కలుగచేస్తోంది.
ఇంట్లోనే కాదు డెకరేషన్ చేయడంలో లిల్లీ పూలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి.
లిల్లి పూలు ఇంటిలో ఎక్కడ ఉంచినా సరే సువాసన వెదజల్లుతుంది. ఇంటిలో మంచి ఫీలింగ్ కలిగేందుకు దోహద పడుతుంది.
పూలలో రారాజుగా తులిప్స్ నిలుస్తాయి. ఫంక్షన్లలో చేసే డెకరేషన్‌లో తులిప్ అలంకరించడంతో మంచి లుక్ వస్తోంది. ఇంటిలో తులిప్ ఉంచితే మంచి ఫీలింగ్ కలుగుతుంది.
గులాబీ పూలను చూస్తేనే మంచి అనుభూతి కలుగుతుంది. వాటి మనోహర రూపం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. గులాబీలు గదిలో ఉంచితే మంచి ఆలోచనలు వస్తాయి.
పయోని పూలు చూడ ముచ్చటగా ఉంటాయి. పింక్ కలర్‌లో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ పూలు గదిలో పెట్టడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి.
హైడ్రేంజ పూలు తెలుపు, లైట్ పింక్ రంగులో పెద్దగా ఉంటాయి. వేసవి, వసంత రుతువులో మాత్రమే ఈ పూలు లభిస్తాయి. మీ గదిలో హైడ్రేంజ పెడితే ఆ చోట మరింత కాంతివంతంగా మారుతుంది.