చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే  సున్నిపిండి 

సున్ని పిండి చర్మం పై పొరను శుభ్రపరుస్తుంది. ఇది మీ చర్మానికి మెరుపును ఇస్తుంది. 

సున్నిపిండి తయారీలో ఉపయోగించే శనగ పిండి, పెసర పిండి, బియ్యప్పిండి.. చర్మాన్ని సంరక్షిస్తాయి.

ఈ పిండి చర్మ రంధ్రాల నుంచి మురికి, ఇతర కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఇది మొటిమలు, చర్మ సమస్యలను నివారించడానికి కూడా సహాయపడుతుంది.

సున్ని పిండిలోని మూలికా పదార్థాలు చర్మాన్ని బిగుతుగా మార్చడానికి సహాయపడతాయి.

ఇందులోని సహజ నూనెలు చర్మానికి మాయిశ్చరైజేషన్ పెంచుతాయి. చర్మం చాలా సున్నితంగా మారుతుంది.