ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ల  వినియోగంగా విపరీతంగా పెరిగింది.

స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగితే ఆ కుటుంబాలకు కలిగే నష్టాలపై వీవో, సైబర్ మీడియా రీసెర్చ్

ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ ప్రతి నిమిషం అత్యవసరంగా మారింది. కాల్స్ మాట్లాడడంతో పాటు అనేక పనులు, ఆర్థిక లావాదేవీల నిర్వహణకు చాలా ఉపయోగపడుతోంది.

స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ సమయం గడపడం వల్ల ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు తగ్గిపోతాయి.

ఈ అధ్యయనంలో 69 శాతం మంది పిల్లలు, 73 శాతం మంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని అంగీకరించారు.

స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగించడం అనేది పిల్లలతొో పాటు చాలా మంది పెద్దలకు అలవాటుగా ఉంటుంది. కొందరు పెద్దలు దాదాపు రోజంతా ఫోన్ లోనే గడుపుతారు.

ఫోన్ వినియోగంలో కొన్ని నిబంధనలు ఏర్పర్చుకుంటే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం మరింత బలపడుతుంది.

కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. నిద్ర పోయే ముందే ఫోన్ ను పక్కన పెట్టేయ్యాలి. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడడంతో పాటు వారిలో ఆటలు ఆడడం, పుస్తకాలు చదవడం వంటివి చేయాలి.