చైనీస్ మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడాన్ని  అదృష్టంగా భావిస్తారు.

ఈ మొక్కకి లక్కీ ఛార్మ్ అనే పేరు కూడా ఉంది.

కొన్ని చిట్కాలు పాటిస్తే ఎంతో సులువుగా ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చు.

ఈ మొక్క చూడడానికి ఆకులు అచ్చం కాయిన్స్ మాదిరిగా ఉంటాయి.

సరైన వెలుతురు వచ్చే చోట పెడితే చాలు. ఇవి చాలా సులభంగా పెరుగుతాయి.

ఎలాంటి ఉష్ణోగ్రతలనైనా సరే తట్టుకుని ఉంటాయి. వీటి స్పెషాల్టీ ఇదే.

సరైన చోట ఉంచితేనే అవి ఎక్కువ రోజుల పాటు పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి.

ఈ మొక్కకు నీరు ఎక్కువ అవసరం ఉండదు ఎప్పుడైతే మట్టి పొడిగా మారిందని గమనిస్తారో అప్పుడు మాత్రమే వాటరింగ్ చేస్తే సరిపోతుంది.

పూర్తిగా మట్టి ఎండిపోయిన తరవాతే నీరు పోస్తే సరైన విధంగా ఈ ఆక్సిజన్ అందుతుంది