కాఫీ తాగేందుకు సరైన సమయం ఒకటి ఉందని నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది ఉదయం లేవగానే కాఫీ తాగుతారు. ఇది తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య ఒంట్లో కార్టిసాల్ అనే హార్మోన్ పతాకస్థాయిలో ఉంటుంది. 

కాబట్టి ఈ సమయంలో కాఫీ తాగితే గాబరా, చికాకు వంటివి తలెత్తే అవకాశం ఉంది

ఉదయం వేళ కాఫీతో హార్మోన్‌ల సమతౌల్యత దెబ్బతినే అవకాశం ఎక్కువ

కార్టిసాల్ హార్మోన్ స్థాయి తగ్గే సమయం (ఉదయం 9.30 నుంచి 11.30 మధ్య) కాఫీకి అనువైనది.

ఉదయం వేళ పరగడుపున కాఫీ తాగితే ఎసిడిటీ పెరుగుతుందన్న విషయం మర్చిపోకూడదు. 

కాబట్టి, ఆహారం తీసుకున్నాకే కాఫీ తాగితే ఎసిడిటీ బెడద ఉండదని నిపుణులు చెబుతున్నారు.