నల్లులు వేల సంవత్సరాల పాటు  మన ఇళ్లలోనే నివసించాయి.

నల్లులు మనిషి రక్తాన్ని పీల్చడంతో పాటు ఆహారం కోసం కోళ్లు, గబ్బిలాలు, ఎలుకల వంటి జంతువులపైనా ఆధారపడతాయి.

సాధారణంగా వీటిని 'బెడ్ బగ్స్' అని పిలుస్తారు.

నల్లులు రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం మొదటి మెట్టు.

నర్సింగ్ హోమ్స్, ఆసుపత్రులు, క్రూయిజ్ షిప్స్, సినిమా హాళ్లు, సబ్ వే, విమానాల్లో ఇవి కనిపిస్తున్నాయి. వాటిని నివారించడానికి పరిశుభ్రత ఒక్కటే సరిపోదు.

నల్లుల నియంత్రణ కోసం పైరిత్రిన్స్, పైరేథ్రాయిడ్స్, బోరిక్ యాసిడ్,వేప నూనె,నికోటిన్ సింథటిక్ రూపాలు, కీటకాల పెరుగుదల నిరోధించే మందులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి

ఇళ్లలో పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలంటే...

ఫర్నీచర్ లేదా సీలింగ్‌లలో ఉండే పగుళ్లను మూసివేయడం, 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద పరుపులను శుభ్రం చేయడం లాంటివి చేయాలి.

నల్లులు పెద్ద సంఖ్యలో ఉంటే మాత్రం పురుగు మందులను తప్పనిసరిగా వినియోగించాలి.

పరుపులు, ఫర్నీచర్ వంటి వాటిని పూర్తిగా తడి లేకుండా ఆరిన తర్వాతే వినియోగించాలి.

ఒకసారి నల్లులను పూర్తిగా తొలిగించాక మళ్లీ అవి రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.