మన ఇళ్లలో చెక్కతో తయారైన  వస్తువులు ఎన్నో ఉంటాయి.

వీటిని సరిగ్గా మెంటెయిన్ చేయాలంటే వాటికి చెద పట్టకుండా చూడాలి.

కొన్ని సార్లు వాతావరణం తేమగా ఉండడం వల్ల చెదపురుగులు ఊరికే వచ్చేస్తాయి.

ఎక్కువ రోజులు వస్తువుల్ని వాడకపోయిన చెద పురుగులు వస్తాయి.

అలోవెరా కూడా చెద పురుగుల్ని నాశనం చేస్తాయి. అందుకోసం చెదపురుగులు తిరిగే చోట అలోవెరా జెల్ రాయడం మంచిది.

వెనిగర్‌ని నిమ్మరసంలో బాగా కలపాలి. దీనిని స్ప్రే బాటిల్‌లో వేసి స్ప్రే చేస్తే ఈ ఘాటు వాసన చెద పురుగుల్ని చంపేస్తాయి.

ఓ గ్లాసు నీటిలో స్పూన్ పరిమాణంలో ఉప్పు కలపండి. దీనిని స్ప్రే బాటిల్‌లో పోయండి.

దీనిని వాడడం వల్ల చెద పురుగుల్లో డీహైడ్రేషన్ మొదలవుతుంది.దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే చెద పురుగులు చచ్చిపోతాయి.

రెండు కప్పుల నీటిలో రెండు టేబుల్ స్పూన్ల లిక్విడ్ డిష్ సోప్ వేయండి. బాగా కలపండి. దీనిని మనం స్ప్రే బాటిల్‌లో వేసి చెదలు తిరిగే చోట స్ప్రే చేయండి.