అనేక మంది ఎన్నో ఆశలతో ఈ ఏడాదిని ప్రారంభించారు.

కొత్త ఏడాదిలోనైనా కెరీర్‌లో దూసుకుపోయేందుకు కొన్ని స్కిల్స్ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. 

ఏఐకి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీపై వీలైనంతగా అవగాహన పెంచుకోవాలి

సైబర్ సెక్యూరిటీ రంగానికి సంబంధించిన నైపుణ్యాలకు ఈ సారి మంచి డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. 

క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలున్న వారికి ఈ ఏడాది మంచి అవకాశాలు లభిస్తాయి

అన్ని రంగాలకు కీలకంగా మారిన డేటా అనలిటిక్స్ నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిసరి

జనాలు ఎక్కువ సేపు ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారు. కాబట్టి, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ బిజినెస్ పెంచుకునేందుకు అక్కరకొస్తాయి

ఈ నైపుణ్యాలతో పాటు సాఫ్ట్ స్కిల్స్‌పై దృష్టిపెడితే విజయం తప్పక సిద్ధిస్తుందని నిపుణులు చెబుతున్నారు.