ఈ సింపుల్ చిట్కాలతో.. కల్తీ పన్నీర్ ఏదో కనిపెట్టండి..!
నకిలీ పన్నీర్‌ను సింథటిక్ పన్నీర్ అని అంటారు. దీన్ని పాలతో కాకుండా వెజిటేబుల్ నూనె, పిండి, రసాయనాలు లాంటివి వాడి నిజమైన పన్నీరు లాగా తయారు చేస్తారు
కల్తీ పన్నీర్ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీ చేతుల మధ్య పన్నీర్‌ను పెట్టి నలిపి చూడండి. వేళ్లతో నలిపినప్పుడు సులభంగా పిండిలాగా అయిపోతే అది కల్తీ పన్నీర్ అని అర్థం
ఒకవేళ పన్నీర్ విరిగిపోకుండా గట్టిగా ఉంటే అది నిజమైనదని గుర్తించాలి.
పన్నీర్ ను నీళ్లలో వేసి కాసేపు మరిగించాలి. అది చల్లారాక దానిలో కందిపప్పు పొడి చేసి కాస్త కలపాలి.
కాసేపటికి పన్నీర్ లేత ఎరుపు రంగులోకి మారినట్లయితే అది యూరియా, లేదా డిటర్జెంట్ తో కల్తీ చేశారని అర్థం
పన్నీర్ కొనేముందు దానిని చేత్తో నలిపి చూడాలి. లేదాంటే పన్నీర్ ను కొంచెం నోట్లో వేసుకుని రుచి చూసి కొనాలి.
Related Web Stories
వినికిడి శక్తి అత్యధికంగా ఉన్న జీవాలు ఇవే!
వివిధ రకాల చక్కెరలు మరియు వాటి ఉపయోగాలు
ఈ ఒక్క ఆకు తింటే ఎంత షుగర్ ఉన్నా సరే.. సర్రున తగ్గుతుంది!
ఆత్మవిశ్వాసం పెంచుకునే మార్గాలు!