విజయానికి పునాది ఆత్మవిశ్వాసమే. కాబట్టి, ఆత్మ విశ్వాసం పెంచుకుంటే విజయాలు వాటంతట అవే వస్తాయి

ముందుగా చిన్న లక్ష్యాలను చేరుకుని ఎవరికి వారు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి

పెద్ద లక్ష్యాలను చిన్నవిగా విభజించాలి. లక్ష్యాలను ఏమేరకు చేరుకున్నదీ క్రమం తప్పకుండా ముందింపు వేసుకోవాలి

క్రమం తప్పకుండా కసరత్తు చేస్తే మానసిక ఆరోగ్యం ఇనుమడించి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి

భయాలకు లొంగిపోవద్దు. వైఫల్యాలను అవకాశాలుగా మలుచుకుని ముందడుగు వేయాలి

ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటే ఆత్మవిశ్వాసం పెరిగి వ్యక్తులకు తమ సామర్థ్యంపై నమ్మకం పెరుగుతుంది

తాత్కాలిక సంతోషాలకు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్లక్ష్యం చేయొద్దు. విజయాలే అసలైన సంతోషం అన్న విషయాన్ని మర్చిపోకూడదు

సందేహాలను వదిలిపెట్టి సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తే విజయం అదే వస్తుంది

ఉత్సాహవంతులు, సానుకూల దృక్పథం కలవారి మధ్య ఉంటే ఆ గుణాలను మనకూ అలవడతాయి