రొయ్యలు దమ్ బిర్యానీ ఇలా చేస్తే లొట్టలేసుకుని లాగించాల్సిందే..
కావలసిన పదార్థాలు:రొయ్యలు బాస్మతి బియ్యం పెరుగు నిమ్మరసం కారంపొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు- రుచికి సరపడినంత గరంమసాలా నూనె ఉల్లి ముక్కలు జీడిపప్పు కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకులు డాల్డా లేదా నెయ్యి
ఒక గిన్నెలో రొయ్యలు వేసి వాటిలో నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, వేగించిన ఉల్లి ముక్కలు, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు నూనె వేసి మాగ్నెట్ తయారు చేసుకోవాలి
ఈ మిశ్రమాన్ని రెండు గంటలపాటు అలాగే ఉంచాలి.
ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో గరం మసాలా, బిర్యానీ ఆకులు వేయాలి.
నీళ్లు మరిగాక కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేయాలి. బియ్యం సగం ఉడికాక నీళ్లు వంపేయాలి.
మాగ్నెట్ చేసుకున్న రొయ్యల్ని ఒక పొరలా వేయాలి. వాటిపైన సగం ఉడికించిన బిర్యానీ రైస్‌ను ఒక పొరలా పరవాలి
పైన కొంచెం నెయ్యి వేయాలి. ఇలా లేయర్స్‌గా మాగ్నెట్ చేసుకున్న రొయ్యల్ని తర్వాత బిర్యానీ రైస్‌ను వేసుకోవాలి.
అనంతరం వేగించిన ఉల్లి ముక్కలను పరచుకోవాలి. తర్వాత గిన్నె మీద మూత పెట్టి ఆవిరి బయటకు రాకుండా మైదాతో మూసేయాలి.
20 నిమిషాల తర్వాత మూతను తీసి కొత్తిమీర, పుదీనాల తరుగు, జీడిపప్పు, వేగించిన ఉల్లిపాయ ముక్కలతో అలంకరించాలి.