ఇస్రో నూతన చైర్మన్‌గా వీ నారాయణన్‌ నియమితులయ్యారు

ప్రస్తుత చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ పదవీ కాలం ముగియనుంది

జనవరి 14న నారాయణన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు

వీ నారాయణన్‌ రెండేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నారు

నారాయణన్‌ ప్రస్తుతం ఇస్రోలో లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా ఉన్నారు

రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్‌ చోదక వ్యవస్థల్లో ఆయనకు అనుభవం ఉంది

సంస్థలో నాలుగు దశాబ్దాలుగా వీ నారాయణన్‌ వివిధ హోదాల్లో పనిచేశారు

నారాయణన్‌ స్వస్థలం కన్యాకుమారి

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో క్రయోజెనిక్‌ ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకుతో ఎంటెక్‌ పూర్తిచేశారు