చద్దన్నంతో టేస్టీ  టమాటో పులావ్..

ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.

ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, ఉల్లిపాయ చీలికలు వేపుకోవాలి.

అందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.

 ఇప్పుడు టమాటోలను మిక్సీలో వేసి గుజ్జులా చేసుకోవాలి. దానిని పాన్ లో వేయాలి.

అనంతరం అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.

తక్కువ మంటలో.. ఆయిల్ పైకి తేలేంతవరకు వేయించుకోవాలి.

తర్వాత మిగిలిపోయిన అన్నం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. 

చివర్లో కొత్తిమీరతో గార్నీషింగ్ చేసుకోండి. అంతే.. ఎంతో రుచిగా ఉండే టమాటో పులావ్ రెడీ..