చలికాలంలో వీటిని తింటే మలబద్దకం  సమస్య వస్తుంది జాగ్రత్త మరి..

 ఆవు పాలలోని ప్రోటీన్ కంటెంట్ మలబద్ధకాన్ని కలిగిస్తుందని, ప్రేగు కదలికలను నెమ్మదిస్తుందని ఓ నివేదికలో తేలింది.

పిజ్జా, చిప్స్ వంటి నూనెలో వేయించిన ఆహారాలు కూడా మలబద్ధకానికి కారణమవుతాయి

మైదా పిండితో చేసిన పిండి వంటలు, బిస్కెట్లు, వైట్ బ్రెడ్ కూడా మలబద్ధకానికి ప్రధాన కారణాలు

 రెడ్ మీట్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం కలిగిస్తుంది

మిఠాయి, చాక్లెట్, పంచదారతో కూడిన స్నాక్స్ కూడా మలబద్ధకానికి ప్రధాన కారణాలుగా భావిస్తారు

 కాబట్టి, వీలైనంత వరకు శుద్ధి చేసిన ధాన్యాలకు బదులుగా తృణధాన్యాలను మీ ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నించండి.