ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం, జీలకర్ర నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

దీన్ని తయారు చేసేందుకు ఒక పాన్‌లో చెంచా జీలకర్ర, చెంచా బెల్లం వేయాలి. 

ఈ నీటిని బాగా మరిగించి, ఫిల్టర్ చేసి తాగవచ్చు. 

బెల్లం, జీలకర్ర నీటిలోని అనేక పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. 

ఈ పానీయం మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. 

బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది బాగా పని చేస్తుంది. 

రక్తహీనతను తొలగించడంలో దోహదం చేస్తుంది. 

చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.