ఈ నూనె తో  తెల్లజుట్టు సమస్యకు చెక్..

తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నట్లయితే నువ్వుల నూనె మీకు చక్కటి పరిష్కారమవుతుంది

నువ్వుల నూనె, కరివేపాకు, ఉల్లిపాయ రసం ఈ మూడు కలిపి బాగా మరగబెట్టాలి. అనంతరం దాన్ని వడకట్టాలి.

తలస్నానానికి గంట ముందు ఆ ద్రావణాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. వెంట్రుకలకు అన్నింటికీ కలిసేలా కుదుళ్లవరకూ రాయాలి.

ఓ పది నిమిషాలపాటు మర్దనా చేయాలి. అనంతరం గంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి.

వారానికి కనీసం రెండు సార్లైనా క్రమం తప్పకుండా ఈ నూనెను తలకు రాసుకున్నరాంటే కొద్ది రోజుల్లోనే తెల్ల జుట్టు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది

 ఇది జుట్టును క్రమంగా నల్లగా మారుస్తుంది, సహజమైన రంగును తిరిగి పొందేలా చేస్తుంది.

ఈ నువ్వుల నూనెలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో జుట్టుకు మంచి పోషణ అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.