ఈ పనస కాయల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కూరకు ఉపయోగించేవి.. రెండో రకం తొనలు తినేవి.
పనస పొట్టు దొరికే సమయంలో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంద్రలో కూడా తప్పని సరిగా పనస పొట్టు కూరని తయారు చేస్తారు.
పెళ్ళిళ్ళు, ఫంక్షన్లలో తప్పని సరిగా పనస పొట్టు కూరకు ప్రత్యెక స్థానం ఉంటుంది.
జీడిపప్పు, పచ్చిమిరపకాయలు,కరివేపాకు ,ఆవాలు, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, ఎండుమిరపకాయలు,నువ్వుల నూనెకావలసినంత కారము పసుపు, ఉప్పు
మిక్సి గిన్నె తీసుకుని ఒక స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు , ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
స్టవ్ మీద గిన్నె పెట్టి.. అందులో పనస పొట్టు వేసి తగినంత నీరు వేసి మెత్తగా ఉడికించాలి. ఇలా ఉడికించిన పనస పొట్టుని నీరు లేకుండా వార్చుకోవాలి.
నీరు పిండిన పనస పొట్టును ఒక పళ్ళెంలోకి తీసుకొని ఒక బాణని స్టవ్ మీద పెట్టి తగినంత నూనె పోసుకుని వేడి ఎక్కిన తర్వాత పచ్చి మిర్చి, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు జీడిపప్పు వేసి పోపునీ వేయించుకోవాలి.
చింతపండు గుజ్జు వేసి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన పనస పొట్టుని వేసి బాగా కలిపి తక్కువ మంట మీద మగ్గనివ్వాలి.
పనస పొట్టు కూరలో ఆవ వేసి తర్వాత నూనె వేసి కూరని బాగా కలపాలి. అంతే గోదావరి జిల్లా స్పెషల్ టేస్టీ టేస్టీగా ఆవ పెట్టిన పనస పొట్టు కూర రెడీ.