హనుమకొండ ఇందిరమ్మ కాలనీలో
సర్పాల సయ్యాట...
సాధారణంగా పాములంటే చాలామందికి చెప్పలేనంత భయం. పాము పేరు ఎత్తగానే భయంతో వణికిపోతుంటారు.
అయితే ఒక్కోసారి ఆహారం, ఆవాసం, ఇతర కారణాలతో అవి దారితప్పి జనావాసాల్లోకి వస్తుంటాయి.
అలాగే హనుమకొండ ఇందిరమ్మ కాలనీలోకి వచ్చిన రెండు సర్పాల సయ్యాట తాజాగా కనువిందు చేసింది.
విషసర్పాలు పట్టపగలే రోడ్లపై హల్‌చల్ చేయడంతో స్థానికులు, పాదచారులు భయబ్రాంతులకు గురయ్యారు.
అనంతరం తేరుకుని ఆసక్తిగా తిలకించారు. మరికొంతమంది యువత సయ్యాటను ఫోన్లలో బంధించారు.
ఆ వీడియోలను వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి.
వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారిపోయాయి.
దీంతో విష సర్పాలు రోడ్లు, ఇళ్లల్లోకి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Related Web Stories
డీప్ ఫ్రీజ్‌లో గడ్డ కట్టిన ఐస్‌కి సింపుల్ చిట్కా
ఆ గ్రామాల్లో రాఖీ పండుగ జరుపుకోరు.. చరిత్ర ఇదే..
అందమైన జలపాతం.. అంతులేని విషాద గాథ..
లివింగ్ రూమ్ అందాన్ని చిన్న చిట్కాలతో మార్చేయచ్చు..