ఆ గ్రామాల్లో రాఖీ పండుగ  జరుపుకోరు.. చరిత్ర ఇదే..

హిందువులు రాఖీ  పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ పండుగ రోజున, సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, వారి క్షేమం, ఆయురారోగ్యాలు కోరుకుంటారు.

కానీ ఓ గ్రామంలో  మాత్రం రాఖీ పండుగ‌ను  65 సంవ‌త్సరాలుగా జ‌రుపుకోవ‌ట్లేద‌ట‌. 

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని  వ‌జీరాగంజ్ పంచాయ‌తీలోని జ‌గ‌త్‌పూర్వ‌లో రాఖీ పండుగ జ‌రుపుకుంటే అన‌ర్థాలు జ‌రుగుతాయ‌ని వారి న‌మ్మకం. 

1955లో రక్షా బంధన్ రోజు ఉదయం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. 

ఆ సంఘటనను వారు అరిష్టంగా భావించి, రాఖీ పండుగ‌ను చేసుకోవ‌డం మానేశారు ఆ గ్రామ‌స్తులు.

 దీంతో  ఇప్పటికీ జ‌గ‌త్‌పూర్వలో ఎవ‌రూ రక్షా బంధ‌న్‌ని చేసుకోరు.