అందమైన జలపాతం..
అంతులేని విషాద గాథ..
మేఘాలయ రాష్ట్రంలోని నోహ్కలికై జలపాతం ఒక అందమైన ప్రదేశం. ఇది 340 మీటర్ల ఎత్తుతో భారతదేశంలోనే ఎత్తైన జలపాతాలలో ఒకటి.
కానీ ఈ జలపాతం వద్ద
ఓ ఘోర సంఘటన జరిగింది.
మరి ఆ భయంకర కథను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాసీ భాషలో ‘కా’ అనే పదం స్త్రీ లింగాన్ని సూచిస్తుంది. లికై అనేది ఒక స్త్రీ పేరు.
అయితే.. స్థానిక జానపద కథల్లో
నోహ్కాలికై జలపాతానికి పైన ఉండే రంగ్జిర్తెహ్ గ్రామానికి చెందిన లికై అనే మహిళ
భర్తను కోల్పో తుంది.
ఆ మహిళకు తన బిడ్డను చూసుకోవడం
కష్టంగా ఉండేది.
దాంతో ఆమె మరో పెళ్లి చేసుకుంది.
ఆమె రెండో భర్త దుర్మార్గుడు.
ఆమె కూతురు అంటే రెండో భర్తకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. దీంతో ఆ బిడ్డని చంపేసి భార్యకు కూర వండి పెట్టాడు
ఆ దుర్మార్గుడు.
లికై.. ఆ కూర తినేసి వక్క వేసుకునేటప్పుడు తన కూతురి వేలును చూసి అసలు
విషయం తెలుసుకుంటుంది.
ఆ తర్వాత ఆమె. దుఃఖంతో నోహ్కలికై జలపాతం నుంచి దూకి ఆత్మహత్య
చేసుకున్నటు చెబుతారు.
అప్పటి నుంచి ఈ జలపాతాన్ని "నోహ్కలికై జలపాతం"
అని పిలుస్తున్నారు.
Related Web Stories
ఇంట్రోవర్ట్స్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
ఈ హెర్బల్ డ్రింక్స్.. మీ బరువును, బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తాయి..
హనుమకొండ ఇందిరమ్మ కాలనీలో సర్పాల సయ్యాట...
డీప్ ఫ్రీజ్‌లో గడ్డ కట్టిన ఐస్‌కి సింపుల్ చిట్కా