మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదేనా? లేక కల్తీదా? ఇలా చిటికెలో తెలుసుకోండి..
ఈ రోజుల్లో అన్ని ఆహార పదార్థాలు కల్తీ మయం అవుతున్నాయి. అందులో టీ పొడి ముఖ్యమైనది
ఈ కింది చిట్కాల ద్వారా నకిలీ టీ పొడిని ఇంట్లోనే సులువగా గుర్తించవచ్చు. ఎలాగంటే..
టీ పొడి ముఖ్యమైనది. కొబ్బరి పొట్టు పొడి, చెట్టు బెరడు పొడి, చింతపండు గింజల పొడి సహా రకరకాల రసాయనాలు కలిపిన టీ పొడిని మార్కెట్లో కల్తీ
విక్రయిస్తున్నారు
నీళ్లలో పౌడర్‌ని పరీక్షించడం ద్వారా టీ పొడి అసలైనదా, నకిలీదా అని తెలుసుకోవచ్చు
గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. దానిలో టీ పొడి వేయాలి. వెంటనే రంగు వదిలితే అది నకిలీ.. ముదురు రంగు లేకుండా టీ పొడి మొత్తం నీటి అడుగుకు చేరితే అది అసలైనదని అర్థం.
కల్తీ లేని టీ పొడితో చేసిన టీ సుగంధం మాదిరి రుచిగా ఉంటుంది
టీ పొడిలో కల్తీ చేరితే అది రుచికి చేదుగా ఉంటుంది. పొడి అసలైనదో కాదో తెలుసుకోవడానికి తయారు చేసిన టీ రంగును గమనించవచ్చు
మీరు ఇంట్లో వాడుతున్న టీ పౌడర్ నకిలీదైతే దానిని మానేయడం మంచిది