ఈ టీ తాగితే పళ్లు పుచ్చిపోవు..
పాలు, పెరుగు, జున్ను వంటి పాల పదార్థాలలో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి పళ్ళ పై ఉండే ఎనామెల్ అనే బలమైన పొరను గట్టిగా చేస్తాయి. దాంతో పళ్ళు బలంగా తయారవుతాయి.
రోజూ ఒక కప్పు పాలు లేదా పెరుగు తీసుకోవడం ద్వారా పళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే సహజ రసాయనాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి, వాపులను తగ్గిస్తాయి.
ప్రతి రోజు ఒకసారి గ్రీన్ టీ తాగడం వల్ల పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుకోవచ్చు.
పాలకూర, బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరలలో విటమిన్ A, విటమిన్ C, కాల్షియం, ఫోలేట్ వంటి పోషకాలు చాలా ఉంటాయి.
ఆకుకూరలను రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
నోటి ఆరోగ్యం బాగుండాలంటే కేవలం బ్రష్ చేయడం, మౌత్ వాష్ వాడటంతో సరిపోదు. మంచి ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యమైనవి.
Related Web Stories
ఈ ప్రదేశాలు గురించి తెలుసా.. వర్ష కాలంలో భూతల స్వర్గాలు ఇవి..
రుచికరమైన వంటకం మసాలా మ్యాగీ
ఇంట్లోనే కోల్డ్ కాఫీ రెసిపీ ఇలా తయారు చేసుకోండి
ఇలా చేస్తే.. 15 నిమిషాల్లో రుచికరమైన లంచ్ రెడీ..