భుజం నొప్పి ఉంటే.. సాధారణ పనులేవి సరిగా చేసుకోలేం.
కొన్ని సార్లుపైకి ఎత్తడానికి కూడా వీలు కాదు. ఈ నేపథ్యంలో పలు పరిష్కార మార్గాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం, కార్టిలేజ్ అరిగిపోవడం, ప్రమాదం జరగడం, భుజం ఎముకల్లో ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు చేయి పైకి ఎత్తడం ఇబ్బంది కలుగుతుంది. పనులు చేయడం కష్టంగా ఉంటుంది.
ఇలా భుజం నొప్పి వచ్చినప్పుడు మందులతో కాకుండా చిన్న చిన్న వ్యాయామాలతో తగ్గించుకోవచ్చు.
చేతిని గోడకు పెట్టి లేపడం.. టవల్‌తో వీపు భాగంవైపు కదలికలు తీసుకొని రావడంతో కాస్త ఉపశమనం ఉంటుంది.
మధుమేహం ఉంటే ముందుగా దానిని నియంత్రించాల్సి ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసిన ప్రయోజనం ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం అన్నింటి కంటే ఉత్తమమైన మార్గం.
రెండు టేబుల్ స్పూన్ల పసుపును..ఒక చెంచా కొబ్బరినూనెలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో పూతగా రాసిన ఉపశమనం లభిస్తుంది.
లావెండర్ నూనె లేకుంటే గోరు వెచ్చని ఆలీవ్ నూనెతో కానీ నొప్పి ఉన్న ప్రదేశంలో మర్దన్ చేయాలి.
నువ్వుల నూనెతోపాటు మునగ, చింతాకు వేసి రాయాలి.
దశమూలల తైలం కూడా ఈ నొప్పికి బాగా పని చేస్తుంది.
చల్లని లేదా వేడి నీటితో కాపడం పెట్టినా నొప్పి తగ్గిపోతుంది.